ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. ప్రకటించిన మంత్రి బొత్స

 ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. ప్రకటించిన మంత్రి బొత్స

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల(Exams) షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక నెలరోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చిలోనే పరీక్షల షెడ్యూల్​ ను విడుదల చేశారు. 

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మార్చి 31 లోపే రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకూ ఇంటర్ ప్రాక్టికల్స్, మార్చి 1 నుంచి 20 వ తేదీ వరకూ థియరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు.

అలాగే మార్చి 18వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 2024లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదనే ముందుగానే పరీక్షలను నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కాగా.. టెన్త్ పరీక్షలు 6 లక్షల మంది విద్యార్థులు రాయనుండగా.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 5.29 లక్షల మంది, సెకండియర్ 4.79 లక్షల మంది విద్యార్థులు రాయనున్నట్లు వివరించారు.

AP SSC 10th Class 2024 Timetable ఇదే:

  • మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
  • మార్చి 19 న సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 20 న ఇంగ్లిష్
  • మార్చి 22 తేదీ మ్యాథ్స్
  • మార్చి 23వ తేదీ ఫిజికల్ సైన్స్
  • మార్చి 26వ తేదీ బయాలజీ
  • మార్చి 27వ తేదీ సోషల్ స్టడీస్ పరీక్షలు
  • మార్చి 28వ తేదీ మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
  • మార్చి 30వ తేదీ ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుంది.