ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 9వరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విదేశీ మద్యం సవరణ బిల్లును మంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టనుండగా.. హిందూ ఛారిటబుల్ సవరణ బిల్లును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రవేశపెడతారు. అలాగే మెడికల్ హెల్త్, టూరిజం, విద్యాశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ బడ్జెట్ డిమాండ్ గ్రాంట్స్ పై ఓటింగ్ చేపట్టనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 
పెగాసస్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. సమావేశం ప్రారంభమైన వెంటనే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చర్చకు నోటీసు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబు హయాంలోనే ఫోన్లను ట్యాపింగ్ చేసే పెగాసస్ సాఫ్ట్ వేర్ వాడారని చెప్పారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తావించారు. పెగాసస్ పై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉందని.. దీనిపై కమిటీ వేసి దర్యాప్తు చేస్తోందన్నారు. పెగాసస్ పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఎవరెవరు కొన్నారు.. ఎలా ఉపయోగించారనేది తేలాల్సి ఉందన్నారు. 

 

ఇవి కూడా చదవండి

వయసు మీద పడిందని కలలు కనడం మానొద్దు

ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలె