
సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18 నుంచి ఏపీ శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. 18వ తేదీ ఉదయం 9 గంటలకు శాసన సభ సమావేశాలు, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
తొలిరోజు సమావేశాల తర్వాత ఇరు సభల బీఏసీల సమావేశాలు జరగనున్నాయి.. సమావేశాల ఎజెండా, సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి.. వంటి అంశాలపై బీఏసీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు.
►ALSO READ | గత ఏడాది నుంచి ఏపీలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
ఈసారి సమావేశాలకు కూడా హాజరు కాబోమని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వరుసగా 60 అసెంబ్లీ పని దినాలు హాజరు కాకపోతే.. అనర్హత వేటు తప్పదని వైసీపీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు రఘురామ. మరి, ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా..?, లేక డిప్యూటీ స్పీకర్ రఘురామ హెచ్చరించినట్లు వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా అన్నది వేచి చూడాలి.