ఏపీ కేబినెట్​ నిర్ణయాలు:  అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు

ఏపీ కేబినెట్​ నిర్ణయాలు:  అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు తెచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల సమయంలో ఈ నిబంధనను తొలగిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అలాగే  ఎక్సైజ్ పాలసీలపై కేబినెట్ చర్చించింది. 

అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ

అక్టోబర్‌ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన జీవో నెంబర్‌ 217, 144 జీవోలు రద్దు చేసింది.

ALSO READ | జగన్​ ఆస్తుల కేసును త్వరగా విచారించండి: సుప్రీంకోర్టు

రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ రద్దు చేసి, స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అలాగే స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనను తొలగించాలని, అందుకు చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ ముద్ర ముద్రించాలని కేబినెట్ నిర్ణయించింది.