విభజన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అమిత్ షాను కోరిన ఏపీ సీఎం జగన్

విభజన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అమిత్ షాను కోరిన ఏపీ సీఎం జగన్

న్యూఢిల్లీ: విభజన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఢిల్లీలో అమిత్ షాను ఆయన ఇంట్లో జగన్ కలిశారు. వీరిద్దరి భేటీ దాదాపు 40 నిమిషాలకు పైగా సాగింది. ఈ సందర్భంగా విభజన సమస్యలను జగన్ ప్రస్తావించారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ సహా షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తుల విభజనతో పాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిల అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీ విద్యుత్‌ సంస్థల ఆర్థిక స్థిగతులను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 6,756.92 కోట్లు వెంటనే ఇప్పించాలని కోరారు. కాగా, అంతకుముందు ఆదివారం జరిగిన కొత్త  పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్​ హాజరయ్యారు.