చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు: జగన్

చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు: జగన్

చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిన తర్వాత ఇదే విషయమై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. నిజం ఎవరు దాచలేరన్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబు ఎన్ని డ్రామలు చేసినా తాను సర్ ప్రైజ్ కానన్నారు. కొన్ని మీడియా ఛానల్స్ చంద్రబాబు చేసిన డ్రామాను  పెద్ద పెద్ద డ్రామాలుగా చేసి చూపిస్తాయన్నారు. కానీ ఆయన్ను దేవుడ్ని చూస్తున్నారు. ప్రజలు కూడా చూస్తున్నారన్నారు.కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబును ఎంత మోసినా విజయం మాత్రం చివరకు మంచికే దక్కుతుందన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు జగన్. 

సభలో నా బాబాయ్ గురించి ఆయన మాట్లాడతాడా ?ఆయన నాకు బాబాయ్? చంద్రబాబుకు చిన్నాన్న కాదు ? అన్నారు జగన్. అవినాష్ రెడ్డి నాకు మరో బాబాయ్ కొడుకు అన్నారు. ఒక కన్ను మరో కన్నును ఎందుకు పొడుచుకుంటుందని ప్రశ్నించారు సీఎం. మా చిన్నాన్నను  కడపలో పోటీకి దింపితే.. కుయుక్తులు పన్ని చంద్రబాబు అతని పార్టీ ఓడించిందన్నారు. మా చెల్లి, మా బాబయ్ గురించి ఆయనే మాట్లాడారన్నారు. కుప్పంలో ఓడిపోవడంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్నారు. వాళ్ల కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదన్నారు జగన్. చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను మా సభ్యులెవరూ ప్రస్తావించలేదన్నారు.