
PRC పై కీలక ప్రకటన చేశారు.. ఏపీ సీఎం జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ ను.. తిరుపతి సరస్వతీ నగర్ లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిసి PRC పై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందన్నారు. పదిరోజుల్లో ప్రకటన చేస్తామన్నారు సీఎం. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.