
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన భేటీ కానున్నారు. పార్లమెంట్‌లోని ప్రధాని ఆఫీసులో వీరు సమావేశం కానున్నట్లు ఏపీ సీఎం ఆఫీసు తెలిపింది.
ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలు, వివాదాలు చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై చొరవ చూపాలని ప్రధానిని జగన్ కోరే అవకాశం ఉంది.