సీఎం జగన్​ బీజేపీకి ఊడిగం చేస్తున్నారు:షర్మిల

సీఎం జగన్​ బీజేపీకి ఊడిగం చేస్తున్నారు:షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల దూకుడు పెంచారు.  ఏపీ ప్రజలు బీజేపీని తిరస్కరించినా సీఎం జగన్​ మాత్రం ఆ పార్టీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.  శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైఎస్సార్ పాదయాత్ర ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రజా ప్రస్థాన జ్ఞాపిక స్థూపాన్ని షర్మిల మంగళవారం ( జనవరి 23)సందర్శించారు.నా ప్రస్థానం వైఎస్ పాదయాత్ర ముగింపు దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాను. రాజన్న బిడ్డను ఆశీర్వదించండి.  ఆ పాదయాత్ర నుంచి పుట్టినవే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా పేదల పక్షాన నిలబడటానికి వచ్చానని ఏపీ కాంగ్రెస్​ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.   

ఏపీలో పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు.కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా జగన్ అన్న మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు.  ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించకపోయినా రాష్ట్ర ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి.. బీజేపీకి బానిసలు అయిపోయారని దుయ్యబట్టారు.  జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెడలు వంచుతాను అన్నారు. మరి ప్రత్యేక హోదా ఏమయ్యిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.రాజశేఖర్ రెడ్డి ఆఖరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని... రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేర్చాలనే వచ్చానని షర్మిల అన్నారు.