ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం... ఫ్రీగా హెల్త్ చెకప్, మందులు

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం... ఫ్రీగా హెల్త్ చెకప్, మందులు

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌ను  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్  వర్చువల్ గా ప్రారంభించారు. వచ్చే రెండు నెలల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కొనసాగనుందని తెలిపారు. ఈ క్యాంపెయిన్  కింద  ఇంటింటి ఆరోగ్య సర్వే, ఉచిత పరీక్షలు, మందులు, అవసరాన్ని బట్టి చికిత్స అందించనుంది ప్రభుత్వం.. ఈ క్యాంపైన్ లో ప్రజాప్రతినిధులు అందరూ కచ్చితంగా పాల్గొనాలని నేతలను ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌.

ALSO READ: త్వరలో కురక్షేత్ర యుద్దం జరగబోతోంది: సీఎం జగన్ 

జగనన్న సురక్ష ద్వారా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్‌ చేయబోతున్నాం అన్నారు ఏపీ సీఎం.. ప్రతి ఇంటినీ, ప్రతి గ్రామానీ జల్లెడ పడుతున్నాం.. ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఉన్నా.. వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నాం.. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్టు డాక్టర్ల చేతవారికి చికిత్స అందిస్తున్నామన్నారు. నయం అయ్యే దాకా ఆ పేషెంట్‌ను చేయిపట్టి నడిపిస్తామని తెలిపారు సీఎం జగన్ .. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ గురించి, వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా గురించి కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం అన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు ఏరకంగా పొందుతారనే విషయాన్ని ఈకార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తామని వివరించారు.. 

 ఆరోగ్య శ్రీ సేవలు పొందిన తర్వాత సంబంధిత పేషెంటుకు అవసరమైన మందులు అందేలా, ఆమేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్‌ చేస్తాం అన్నారు. వీరికి ఎలాంటి సమస్యలేకుండా చూస్తాం.. సమయానికి మందులు అందేలా, మళ్లీ అవసరమైన చెకప్‌లు చేయించేలా, అవసరమైన చికిత్స లేదా మందులు అందేలా చూసే బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదని  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ ఆరోగ్య సురక్ష కింద అందిస్తాం.. కేన్సర్‌ లాంటి పేషెంట్లకు ఖరీదైన మందులు కూడా ఉచితంగా ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తాం.. ప్రజారోగ్య రంగంలో జగనన్న ఆరోగ్య సురక్ష కీలక పాత్ర పోషించబోతోందన్నారు.

ఏ పేదవాడు వైద్యంకోసం ఇబ్బంది పడకూడదనే కార్యక్రమాన్ని ఇందులో చేపడుతున్నాం అన్నారు సీఎం జగన్‌.. మొత్తం ఐదు దశల్లో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.. మొదటి దశ ఇప్పటికే ప్రారంభం అయ్యిందంటూ... సెప్టెంబర్‌ 15 నుంచి జరుగుతోంది.. బీపీ, షుగర్‌, హిమోగ్లోబిన్‌ తప్పనిసరిగా పరీక్షలు చేస్తారు.. అవసరాన్ని బట్టి యూరిన్‌, మలేరియా, డెంగ్యూ, కఫం పరీక్షలు చేస్తారన్నారు.. ప్రతి ఇంటికీ వెళ్లి.. ప్రతి ఒక్కరినీ టెస్టు చేస్తారని తెలిపారు సీఎం జగన్.. .. గ్రామంలో హెల్త్‌ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై వివరాలు అందిస్తారు.. అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేసి, వారికి కళ్లజోళ్ల ఇచ్చే కార్యక్రమం కూడా జగనన్న సురక్షలో ఇస్తారు.. ఆరోగ్య శ్రీ కింద చికిత్స తీసుకున్నవారికి తదనంతర సేవలు సరిగ్గా అందుతున్నాయా? లేవా? ఆరోగ్య శ్రీ సేవలు అందాల్సిన వారికి ఎలా అందించాలి? ఈరెండు అంశాలపై కూడా సురక్షలో ప్రత్యేక దృష్టిలో పెడతారు.. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఈ సేవలన్నీ కూడా అందుతాయని స్పష్టం చేశారు సీఎం జగన్‌.  వైద్యం కోసం పేదవాళ్లు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం అన్నారు. 1050 నుంచి 3256 చికిత్సలను ఆరోగ్య శ్రీ సేవలను అందిస్తున్నామని.... నెట్‌వర్క్‌ ఆస్పత్రులను విస్తరించామని పేర్కొన్నారు సీఎం జగన్.