ముచ్చింతల్‌లో ముగిసిన జగన్ పర్యటన

ముచ్చింతల్‌లో ముగిసిన జగన్ పర్యటన


ముచ్చింతల్‌లో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు జగన్. వెయ్యేళ్ల కిందట అసమానతలను రూపుమాపాలన్న బలమైన నమ్మకంతో గురువు నేర్పించిన మంత్రాన్ని సామాన్యులకు ఉపదేశించిన వారు రామానుజ చార్యులు అన్నారు సీఎం. ఆయన్ని ఈరోజు స్మరించుకోవడం మన అదృష్టమన్నారు. రామానుజచార్యులు ఏ విలువలు అయితే పాటించారో సమాజానికి ఇంకా ఆ విలువలు అవసరమన్నారు. ముచ్చింతల్‌లో ప్రవచన మందిరంలో జీయర్ స్వామితో కలిసి విష్ణు సహస్ర నామ అవదాన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రవచన మండపంలో గంట సేపు జగన్ సమయం గడిపారు. ప్రవచన మండపం నుండి సమత మూర్తి విగ్రహం కు వెళ్లి అక్కడి నుండి యాగశాలలో వేద పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి.

 
participating in Sri Ramanuja millennium celebrations || Hyderabad

శంషాబాద్, ముచ్చింతల్ లో శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలు.

Posted by YS Jagan Mohan Reddy on Monday, February 7, 2022