ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా కంట్రోల్ లోకి వస్తోంది. రోజు వారీ కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 24,663 శాంపిల్స్ పరీక్షించగా.. 675 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ బులిటెన్ లో వెల్లడించింది. అలాగే ఒక్క రోజులో చిత్తూరు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 2,414 మందిపూర్తిగా కోలుకున్నారని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,14,502కు చేరింది. ఇందులో 22 లక్షల 88 వేల 989 మంది కరోనా నుంచి రికవరీ కాగా.. 14 వేల 705 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేల 808గా ఉంది.

మరిన్ని వార్తల కోసం..

చిన్నారులకు హెల్మెట్.. లేకుంటే జైలే

ప్రెగ్నెన్సీ టైమ్లో వ్యాక్సినేషన్.. పుట్టబోయే బిడ్డకు మేలు

చైనా కంపెనీకి కేంద్రం షాక్