కరోనా డెత్స్: నిన్న ఏపీ మాజీ సీఎస్.. నేడు ఆయన భార్య

V6 Velugu Posted on Jun 02, 2021

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ భార్య లక్ష్మి కరోనాతో మృతిచెందారు. ప్రసాద్ మరియు లక్ష్మి దంపతులకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రసాద్ ఆరోగ్యం విషమించడంతో ఆయన మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణించిన 24 గంటల్లోనే భార్య లక్ష్మి కూడా చనిపోయారు. కేవలం గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ మృతి చెందడంతో వారి ఇంట విషాదం నెలకొంది. వారి కుమారులిద్దరికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారికి కూడా యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
 

Tagged andhrapradesh, coronavirus, corona death, former CS SV Prasad, SV Prasad wife Lakshmi

Latest Videos

Subscribe Now

More News