ఏపీలో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ముగిసింది. ఈ రెండు రోజుల సదస్సులో రాష్ట్రంతో 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రెండో రోజు రూ. 1.17 లక్షల కోట్ల విలువైన 260 ఎంఓయూలపై సంతకాలు.. మొదటి రోజున, ఏపీ ప్రభుత్వం ₹ 11,87,756 లక్షల కోట్ల విలువైన 92 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. వీటి వల్ల రాష్ట్రానికి రూ.13,05,663 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి అవకాశాలు దక్కినట్లయ్యింది.
మొత్తం పెట్టుబడుల్లో ఒక్క ఎనర్జీ రంగంలోనే రూ.8,84,823 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని వల్ల లక్షా 90 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. పర్యాటక రంగంలో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఐటీ రంగంలో 56, టూరిజంలో 117 ఎంఓయూలు జరిగాయి. ప్రధాన పెట్టుబడిదారులలో, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రూ.2,35,000 కోట్ల పెట్టుబడితో 77,000 మందికి ఉపాధి కల్పించే 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.
