సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ కొత్త వ్యూహం.. లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ..

సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ కొత్త వ్యూహం.. లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ..

సోషల్ మీడియాపై కొత్త వ్యూహం రచిస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. సోషల్ మీడియా నియంత్రణ కోసం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది ప్ప్రభుత్వం. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారధిలను నియమించింది ప్రబుత్వం. ఈ కమిటీ సోష‌ల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపింది ప్రభుత్వం.

తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్‌పై ప్రత్యేక నిఘా పెట్టనుంది మంత్రుల కమిటీ. అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసులపై మంత్రుల కమిటీ అధ్యయనం చేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్, నేషనల్ సెక్యూరిటీ ముప్పులపై చర్యలకు సిఫారసులు, పౌర హక్కుల పరిరక్షణకు సూచనలు ఇవ్వనుంది మంత్రుల కమిటీ.

అవసరమైతే నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు సిఫారసు చేసే అధికారం మంత్రుల కమిటీకి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం. పరిస్థితులను అధ్యయనం చేసి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సిఫారసులను ఇవ్వనుంది మంత్రుల కమిటీ. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా దుష్ప్రచారాలను సీరియస్ గా తీసుకున్న క్రమంలో తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.