ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25 వేలు, ఫస్ట్, ఇతర ఫోర్లు మునిగిన వారికి రూ.10 వేల చొప్పున సాయం చేస్తామని వెల్లడించారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అందరిని ఆదుకుంటామని తెలిపింది. ఏవిధంగా నష్టపోతే దానికి ఎంత నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుందో కూడా వివరాలు ప్రకటించింది.
Also Read:-అమరావతికి వరద వస్తుందన్నోళ్ల నాలుకకు తాళం వేస్తా
- టూ వీలర్స్ దెబ్బతింటే ..రూ.3 వేలు, త్రీవీలర్స్- రూ. 10 వేలు
- తోపుడు బండ్లు దెబ్బతింటే.. కొత్త బండ్లు ఇస్తామని ప్రకటన
- చేనేత కార్మికులకు రూ.15 వేల నుంచి 25 వేలు
- ఫిషింగ్ బోట్స్(డ్యామేజీని బట్టి) .. రూ.9 వేలు-రూ.2 5 వేలు
- గేదెలు మరణిస్తే ..రూ.50 వేలు
- ఎద్దులు మరణిస్తే..రూ.40 వేలు
- పంట నష్టం వరి ఎకరాకు.. రూ. 10 వేలు
- మిరప హెక్టారుకు-రూ.35 వేలు
- హెక్టార్ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు సాయం.
- హెక్టార్ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు సాయం.
- హెక్టార్ చెరకు రూ.25 వేలు, హెక్టార్ పొగాకుకు రూ.15 వేలు.
- హెక్టార్ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు ఆర్థికసాయం.
- హెక్టార్ సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకుకు రూ.15 వేలు.
- జనపనార, కొర్రలు, సామలకు రూ.15 వేలు సాయం.
- పసుపు, అరటికి రూ.35 వేల చొప్పున ఆర్థికసాయం.
- కూరగాయలకు రూ.25 వేలు, మిరపకు రూ.35 వేలు సాయం.
- బొప్పాయికి రూ.25 వేలు, టమాటకు రూ.25 వేలు సాయం.
- జామకు రూ.35 వేలు, పూలకు రూ.25 వేలు సాయం.
- ఉల్లిపాయ రూ.25 వేలు, నిమ్మకు రూ.35 వేలు సాయం.
- మామిడికి రూ.35 వేలు, కాఫీకి రూ.35 వేలు సాయం.
- పుచ్చకాయకు రూ.25 వేలు, నర్సరీకి రూ.25 వేలు సాయం.
- దానిమ్మకు రూ.35 వేలు, సపోటకు రూ.35 వేలు సాయం.
- డ్రాగన్ ఫూట్‌కు రూ.35 వేలు, పామాయిల్ చెట్టుకు రూ.1500 సాయం.
- సెరీకల్చర్‌కు రూ.25 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.1500 సాయం