హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయిన జవాన్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయిన జవాన్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఏపీ జవాన్ లాన్స్ నాయక్ కుటుంబానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. చాపర్ క్రాష్ లో చనిపోయిన సాయి తేజ కుటంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఏపీ సీఎంఓ అధికారులు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 

చిత్తూరు జిల్లాకు చెందిన సాయి తేజ.. సీడీఎస్ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించేవాడు. అయితే ఈ నెల 8న సీడీఎస్ రావత్ తో పాటు వెల్లింగ్టన్ వెళ్తుండగా.. ప్రమాదవశాత్తూ హెలికాప్టర్ కూలిపోయింది. ఆ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న 14 మందిలో ఒక్కరు మినహా అందరూ చనిపోయారు. చనిపోయినవారిలో సాయి తేజ కూడా ఉన్నారు. మంటల్లో మృతదేహాలు బాగా కాలిపోవడంతో గుర్తుపట్టలేకుండా మారిపోయాయి. దాంతో కుటుంబసభ్యుల డీఎన్ఏతో పోల్చి.. మృతదేహాలను గుర్తించారు. శనివారం ఉదయం సాయితేజ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆయన మృతదేహానికి అధికారిక లాంఛనాలతో 13/12/2021 ఆదివారం రోజున అంత్యక్రియలు పూర్తి చేయాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు.