
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇవాళ కోర్టులో రాజధాని అంశంపై వాదోపవాదాలు జరిగాయి. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టత కోరింది. బిల్లు ఉపసంహరించుకునే అంశాన్ని పూర్తి స్పష్టతతో చెప్పాలన్న ధర్మాసనం పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల విరామంలో మంత్రిమండలి సమావేశం జరుగుతుందని మాతో అరగంటలో ప్రభుత్వం స్పష్టత ఇస్తుందన్న అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. మూడు రాజదానుల బిల్లును మాత్రం ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని స్పష్టం చేశారు అడ్వకేట్ జనరల్.
అయితే తదుపరి రాజధాని బిల్లు ఎలా ఉండబోతోందో కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తారని కోర్టుకి ఏజీ నివేదించారు. దీంతో విచారణ వాయిదా వేసింది హైకోర్టు. మూడు రాజధానులు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ సాక్షిగా జగన్ రాజధాని అంశంపై ఎలాంటి ప్రకటన చేస్తారోనని రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త బిల్లు సిద్ధం చేసినట్లు .. ఆ బిల్లుకు కేబినెట్ ఆమోదం కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మూడు రాజధానుల బిల్లును పూర్తిగా రద్దు చేస్తారా ? లేదా ? అదే బిల్లుతో కొత్త సవరణలు చేసి ప్రవేశ పెడతారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.