ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

అమరావతి: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారు. మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు. గత మే నెల 6వ తేదీ నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగగా దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.