ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
  • ప్రధమ స్థానంలో కృష్ణా జిల్లా (72 శాతం)
  • చివరి స్థఆనంలో కడప జిల్లా (50శాతం)
  • మొదటి సంవత్సరం ఫలితాలతోపాటు.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే టాప్

విజయవాడ: ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుద‌ల‌ చేశారు. మొదటి సంవత్సరం 2లక్షల 41వేల 591 ఉత్తీర్ణులు కాగా 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. అలాగే ద్వితీయ సంవత్సరంలో 2లక్షల 58వేల 449 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 61 ఉత్తీర్ణత శాతం  నమోదు అయింది. మొదటి సంవత్సరంతోపాటు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ బాలికలే పైచేయి అయింది.

ఈనెల 25 నుంచి రీకౌంటింగ్ కు అవకాశం

ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ విడుదల చేశారు. ఫస్టియర్ విద్యార్థుల్లో 49 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 60 శాతం ఉత్తీర్ణత సాధించారని ఈ సందర్భంగా మంత్రి బొత్స వివరించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో ఫలితాల్లో కూడా బాలురు 56 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. బాలికలు 68శాతం ఉత్తీర్ణత నమోదు చేశారని తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో 72 శాతం తో కృష్ణా జిల్లా, చివరి స్థానంలో 50 శాతంతో కడప జిల్లా చివరి స్తానంలో నిలిచిందని చెప్పారు. మార్కులపై రీకౌంటింగ్ కు కూడా అవకాశం కల్పిస్తున్నామని.. ఈనెల 25 నుంచి రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 3 నుంచి  రీకౌంటింగ్ జరుగుతాయని మంత్రి బొత్స వివరించారు.