ఏసీబీ సోదాల్లో 2 కోట్ల ప్రాపర్టీ స్వాధీనం... 430 గ్రాముల బంగారం.. రెండు కార్లు.. ఐదు టూ వీలర్స్

ఏసీబీ సోదాల్లో  2  కోట్ల ప్రాపర్టీ స్వాధీనం... 430 గ్రాముల బంగారం.. రెండు కార్లు.. ఐదు టూ వీలర్స్

ఏసీబీ అధికారులు  అవినీతి అధికారులకు  చుక్కలు చూపిస్తున్నారు.    కర్నూల్​ లేబర్​ జాయింట్​ కమిషనర్​ బాలునాయక్​ కు సంబంధించిన ఇళ్లు.. కార్యాలయాలు.. ఆయన బంధువుల ఇళ్లలో  ఏసీబీ అధికారులు సోదా చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని గుర్తించిన అధికారులు ..తిరుపతి... కర్నూలు  సహా 11  చోట్ల సోదాలు నిర్వహించి 2 కోట్ల విలువైన ప్రాపర్టీకి చెందిన  పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం  చేసుకున్నారు. 

బాలునాయక్ కుమారుడు నిర్వహిస్తున్న ఆర్సీ సర్జికల్ షాపులోనూ తనిఖీలు చేశారు.  జి ప్లస్ టు హౌస్..  పౌల్ట్రీ ఫామ్..  రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ...430 గ్రాముల బంగారం... సంబేపల్లిలో టెంపరరీ హౌస్....రెండు కార్లు... ఐదు టూవీలర్లు స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడి పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్​కు  తరలిస్తున్నామని  తిరుపతి ఏసీబీ  డీఎస్పీ వై.జెస్సీ ప్రశాంతి తెలిపారు.