ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటి భవనాలు తెలంగాణలో లేవు: తెలంగాణ గవర్నర్ తమిళి సై

ఎస్ఆర్ఎం  యూనివర్సిటీ లాంటి భవనాలు తెలంగాణలో లేవు: తెలంగాణ గవర్నర్ తమిళి సై

అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కొనసాగుతున్న ఏపీ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో 3వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. . నానో టెక్నాలజీ రంగంలో విశేషమైన సేవలు అందించిన డాక్టర్ అశుతోష్ శర్మకు యూనివర్సిటీ మేనేజ్మెంట్ గౌరవ డాక్టరేట్ ను  ప్రదానం చేశారు. 

ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీని చూశాక తాను ఏపీలో ఉన్నానా, లేక ఫారిన్ కంట్రీలో ఉన్నానా అన్న సందేహం కలుగతుందని  తమిళిసై అన్నారు . గుంటూరు ఎస్ఆర్ఎం  యూనివర్సిటీలోని ఉన్న భవాలు తెలంగాణలో ఎక్కడా లేవన్నారు.   అంతర్జాతీయ స్థాయి ఆడిటోరియంను పరిశీలించిన ఆమె... విద్యార్థుల ఉన్నత విద్యకు మౌలిక సదుపాయాలు ప్రధానమంటూ... యూని వర్సిటీ యాజమాన్యాన్ని అభినందించారు. అవకాశాలను సృష్టించుకోవాలని  విద్యార్థులు ఆమె సూచించారు. కొత్త లక్ష్యాలతో, ఆశయాలతో ముందుకు సాగి... ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అశుతోష్ అన్నారు. 

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణన్ ఇకపై ఛాన్సలర్ గా కొనసాగుతారని యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ టీఆర్ పారివేందర్  పేర్కొన్నారు.  విద్యార్థులు జనరల్ నాలెడ్జిని కూడా పెంచుకోవాలన్నారు. విద్యార్థులు ఉజ్వల జీవన విధానానికి, దేశ ప్రగతికి దోహదపడే కలలను సాకారం చేసుకోవాలని డాక్టర్ సత్యనారాయణన్ పేర్కొన్నారు.   అనంతరం 883 మంది విద్యార్థులకు డిగ్రీలు, బంగారు, వెండి పతకాలను ప్రదానం చేశారు. . ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రేమకుమార్, డీన్లు డాక్టర్ వినాయక్, డాక్టర్ భరద్వాజ్, డాక్టర్ విష్ణుపథ్, డాక్టర్ రంజిత్ థాపా తదితరులు పాల్గొన్నారు.