AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..

AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..

పదో తరగతి పరీక్షలు టెన్షన్ నుండి బయటపడి విద్యార్థులు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఒకపక్క సెలవులను ఎంజాయ్ చేస్తూనే మరో పక్క రిజల్ట్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు స్టూడెంట్స్. ఈ నేపథ్యంలో AP SSC బోర్డు నుండి కీలక ప్రకటన వచ్చింది. ఈ నెలాఖరికల్లా పదో తరగతి ఫలితాలు రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 25న  ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు అధికారులు.

అయితే, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫలితాల విడుదల కోసం ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి అని, ఒకవేళ అనుమతులు రావటం ఆలస్యం అయితే, నెలాఖరుకల్లా ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు అధికారులు. గత ఏడాది మే 6న ఫలితాలు విడుదల చేశామని, ఈ ఏడాది అంతకంటే ముందే విడుదల చేస్తామని అన్నారు అధికారులు. మార్చి 18 నుండి 30వరకూ జరిగిన పదో తరగతి పరీక్షలకు 6లక్షల 30వేల 633మంది విద్యార్థులు హాజరయ్యారు.