కూలడానికి సిద్ధంగా ఉన్న అపార్టుమెంట్

కూలడానికి సిద్ధంగా ఉన్న అపార్టుమెంట్
  • జాకీలతో గోడలకు సపోర్ట్ ఇచ్చి ఖాళీ చేసి వెళ్లిపోయిన ఫ్లాట్ దారులు
  • పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెండో పట్నం 31వ వార్డులో ఉన్న అపార్టుమెంట్
  • 2004లో 19 సెంట్ల స్థలంలో అపార్ట మెంట్ నిర్మాణం
  • నాసిరకంగా 33 ఫ్లాట్లు నిర్మించి అమ్ముకున్న బిల్డర్ 
  • నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్న భీమవరం మున్సిపాలిటీ


పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరం రెండో పట్నం 31 వార్డ్లో  శ్రీ శ్రీనివాస అపార్ట్మెంట్ సపోర్టు గోడలు పెచ్చులూడి కూలిపోవ డానికి సిద్ధంగా తయారైంది. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కొనుగోలు చేసి నివాసం ఉంటున్న ఫ్లాట్ ఓనర్లు అపార్టుమెంట్ కుప్పకూలిపోకుండా జాకీలు.. కర్రలతో సపోర్ట్ ఇచ్చి మంగళవారం ఫ్లాట్లను ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే..
భీమవరం బిల్డర్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న అల్లూరి సత్యనారాయణ రాజు అనే బిల్డర్ 2004లో శ్రీ శ్రీనివాస పేరుతో అపార్ట్ మెంట్ నిర్మించి మొత్తం 33 ఫ్లాట్లు కూడా విక్రయించారు. జి ప్లస్ ఫైవ్ తో నిర్మాణం జరిగిన ఈ అపార్ట్ మెంట్ లో నాణ్యత లోపాల వల్ల 17 ఏళ్లకే కూలేందుకు రెడీ అయింది. అపార్ట్ మెంట్ నిర్మాణాన్ని నిబంధనల మేరకు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు బాధితులు. డబ్బులకు కక్కుర్తి పడి ఆనాడు బిల్డర్ నాణ్యత లేని విధంగా అపార్ట్ మెంట్ నిర్మించి నందు వల్లనే నేడు ఈ అపార్ట్ మెంట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారిందని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం జాకీ లతో అపార్ట మెంట్ కు సపోర్ట్ ఇచ్చి ఖాళీ చేసి వెళ్లిపోయిన వారు మ్మత్తులు చేయించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.