యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్​తో అపోలో వర్సిటీ ఒప్పందం

యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్​తో అపోలో వర్సిటీ ఒప్పందం

న్యూఢిల్లీ: యూకే,  భారత దేశాల మధ్య విద్య,  పరిశోధన రంగాలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి, యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్, అపోలో హాస్పిటల్ గ్రూప్​నకు చెందిన అపోలో యూనివర్సిటీ (టీఏయూ)  జతకట్టాయి. ఈ సహకారంలో భాగంగా ఈ రెండు సంస్థలలో ఒక కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌‌ను ప్రారంభిస్తామని రెండు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. లీసెస్టర్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే విద్యార్థులు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని టీఏయూలో రెండు సంవత్సరాలు చదువుతారు. 

మొదటి విడత కోసం అపోలో యూనివర్సిటీ  యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ సంయుక్తంగా ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించి 120 మందికి బోధిస్తాయి. టీఏయూలో తమను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, చదువు విద్యార్థులు లీసెస్టర్‌‌లో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లేదా సాఫ్ట్‌‌వేర్ ఇంజినీరింగ్‌‌లో స్పెషలైజేషన్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది.