యాపిల్ ఐ ఫోన్​ కొత్త ఫీచర్లు

యాపిల్ ఐ ఫోన్​ కొత్త ఫీచర్లు

కొత్త ఫీచర్లు, అప్​డేట్స్​కు​ మాత్రమే కాదు యూజర్ల సేఫ్టీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి టెక్​ కంపెనీలు.  అలాంటిదే... యాపిల్ తీసుకొచ్చిన ఐ ఫోన్​ 14 సిరీస్​.  ఎమర్జెన్సీ టైంలో సిగ్నల్ లేకున్నా కూడా శాటిలైట్ కనెక్టివిటీతో పనిచేస్తుంది. ​అట్లనే, యూట్యూబ్​లో క్వాలిఫైడ్ కంటెంట్​ క్రియేటర్స్​ చేసిన సబ్జెక్ట్ వీడియోలు రాబోతున్నాయి. ఇవేకాకుండా ట్వీట్స్​ని ఈజీగా షేర్ చేసే ఫీచర్, మైక్రోసాఫ్ట్​ తెస్తున్న ట్యాబ్లెట్ ఫ్రెండ్లీ టాస్క్​బార్ వంటివి ఈ వారం టెక్నాలజీ అప్​డేట్స్​లో కొన్ని. వీటి గురించి మరిన్ని వివరాలు.

శాటిలైట్ కనెక్టివిటీతో 14 సిరీస్

ఈమధ్యే ఐ ఫోన్ 14 సిరీస్  తీసుకొచ్చింది యాపిల్. వీటిలో యూజర్ల సేఫ్టీ కోసం  శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్​ని యాడ్ చేసింది. ఎమర్జెన్సీ టైంలో సిగ్నల్ అందక ఫోన్​ పనిచేయనప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్​ని ఉపయోగించుకొని అలర్ట్​ మెసేజ్​లు​ పంపిస్తుంది. దాంతో, యూజర్లు ప్రమాదం నుంచి బయటపడేలా చేస్తుంది. ఐ ఫోన్​14 ప్రో, నాన్– ప్రో ... రెండింటి లోనూ ఈ ఫీచర్  పనిచేస్తుంది.  ‘స్పేస్​ ఎక్స్’ సంస్థతో కలిసి ఈ ఫీచర్ తెచ్చింది యాపిల్. 
 
పని ఎలా ప్రమాదం జరిగిన ప్పుడు  ఎమర్జెన్సీ సర్వీస్​లకు ఫోన్​ లేదా మెసేజ్​ చేస్తాం. అప్పుడు సిగ్నల్​ ఉంటే ‘ఓకే’. లేదంటే శాటిలైట్ కనెక్టివి టీని ఉపయోగించు కుంటుంది ఐ ఫోన్ 14 సిరీస్. శాటిలైట్ సిగ్నల్ అందగానే ‘శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ మెసేజ్​ పంపండి’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ‘ఓకే’ చేయగానే 15 సెకన్లలో ఎమర్జెన్సీ సర్వీస్​లకు మెసేజ్​ వెళ్తుంది. అంతేకాదు ఆ చుట్టుపక్కల  శాటిలైట్ కనెక్టివిటీ బాగాఉండే లొకేషన్​ కూడా  స్క్రీన్ మీద కనిపిస్తుంది.      

ట్వీట్స్ షేరింగ్ ఈజీ

కొన్ని ట్వీట్స్​ని ఫ్రెండ్స్​తో షేర్ చేసుకోవాలను కుంటారు చాలామంది. అందుకని వాళ్లని ట్యాగ్ చేస్తారు. లేదంటే వాళ్ల అకౌంట్​లో  ట్వీట్స్​ని పోస్ట్ చేస్తారు. ఒకవేళ ఇన్​స్టాగ్రామ్, స్నాప్​చాట్ వంటి యాప్స్​​లో షేర్ చేయాలనుకుంటే ట్వీట్​ని  స్క్రీన్ షాట్ తీసి, పోస్ట్ చేస్తారు. అయితే... ఇకపై నేరుగా ట్వీట్స్​ని షేర్ చేయొచ్చు. అదెలాగంటే... యూజర్లు ట్విట్టర్ లేటెస్ట్​ వెర్షన్​ని అప్​డేట్ చేసుకోవాలి. షేర్ చేయాలనుకున్న ట్వీట్ మీద నొక్కి, ఇన్​స్టాగ్రామ్​ని సెలక్ట్ చేసుకోవాలి. అంతే., ఇన్​స్టాగ్రామ్ స్టోరీస్​లో ట్వీట్స్ షేర్​ అవుతాయి.  స్నాప్​చాట్​లో కూడా ఇలానే ట్వీట్స్​ని షేర్​ చేయాలి. దీంతోపాటు లింక్​డిన్​ పోస్ట్​లు, స్టోరీలను కూడా ఆండ్రాయిడ్, ఐఒఎస్​ సిస్టమ్స్​లో షేర్​ చేసుకునేందుకు సపోర్ట్​ చేయనుంది ట్విట్టర్. 

బర్డ్​ వాచ్ కంటిన్యూ

సోషల్​మీడియాలో ఫేక్ న్యూస్, హింసను ప్రేరేపించే వీడియోలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అలాంటి వాటిని ఎప్పటి కప్పుడు కనిపెట్టి తొలగిస్తుం టాయి కంపెనీలు. ట్విట్టర్ కూడా తప్పుడు ట్వీట్లను అడ్డుకునేందుకు ఈ ఏడాది మొదట్లో ‘బర్డ్​వాచ్’ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. అందులో భాగంగా15 వేల కంట్రిబ్యూటర్స్​కు ఫేక్​ ట్వీట్స్​ను తొలగించే పని అప్పజెప్పింది.​ వీళ్లు ఆ ట్వీట్​ నిజమా? కాదా? అనేది తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్​ చేస్తారు.  ఈ ప్రాజెక్ట్​ని మరి కొన్ని రోజులు కంటిన్యూ చేయనుంది ట్విట్టర్. అంతేకాదు ప్రతివారం కొత్తగా వెయ్యి మందిని ఫ్యాక్ట్ చెకింగ్ కోసం తీసుకుంటామని చెప్పింది.  

ట్యాబ్లెట్ ఫ్రెండ్లీ టాస్క్​బార్​

యాపిల్ కంపెనీ ఐపాడ్​కి పోటీగా ట్యాబ్లెట్ ఫ్రెండ్లీ టాస్క్​బార్​ని తీసుకురానుంది మైక్రోసాఫ్ట్. ఇది ‘టు ఇన్​ వన్​’ ట్యాబ్లెట్స్​గా మాత్రమే ఉపయోగించే పీసీల్లో పనిచేస్తుంది. యూజర్లు ఉపయోగించనప్పుడు ఈ టాస్క్​బార్​ స్క్రీన్ మీద కనిపించదు. అంతేకాదు టైం, బ్యాటరీ ఎంత ఉంది? అనే వివరాలు చూపిస్తుంది. దీన్ని ఎక్స్​పాండ్ చేస్తే... ట్యాబ్లెట్స్​లోని యాప్స్, గ్యాడ్జెట్స్, స్టార్ట్ బటన్, సెట్టింగ్స్​ వంటి వాటిని చూడొచ్చు. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్​ని త్వరలోనే అందుబాటులోకి తేనుంది మైక్రోసాఫ్ట్.

సబ్జెక్ట్ పాఠాల యూట్యూబ్ ప్లేయర్

యూట్యూబ్​లో త్వరలోనే ఎడ్యుకేషన్​ యాప్స్​ ద్వారా స్టడీ కోర్సులు అందించేందుకు  ‘యూట్యూబ్ ప్లేయర్’ ఫీచర్ తేనుంది​. ఇందుకోసం అమెరికాకు చెందిన ‘ఎడ్యుపజిల్’ అనే కంపెనీతో అగ్రిమెంట్ కూడా చేసుకోనుంది. ఈ ఫీచర్  వస్తే... ఎడ్యుకేషన్​కి సంబంధించిన వీడియోలు, సమాచారం దొరకడం ఈజీ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోలు ప్లే అవుతున్నప్పుడు  యాడ్స్, లింక్స్ వంటివి రావు. ‘యూట్యూబ్ ప్లేయర్’ని వాడుకునేందుకు కొంత డబ్బు కట్టాలి. ఈ ఫీచర్ వల్ల మరో ఉపయోగం ఏంటంటే...  నచ్చిన సబ్జెక్ట్ వీడియోలు చూడడమే కాకుండా కంటెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. వచ్చే ఏడాదికల్లా క్వాలిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్​తో సబ్జెక్ట్ వీడియోలు చేయించనుంది. అయితే, ఈ కోర్సులు ముందుగా అమెరికా, దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తాయని, రెస్పాన్స్​ని బట్టి  మిగతా దేశాలకు తీసుకొస్తాం అంటోంది యూట్యూబ్. ఇదేకాకుండా యూజర్లు నాలెడ్జ్​ని పెంచుకు నేందుకు ‘క్విజ్​’ కూడా మొదలు పెట్టనుంది ఈ సంస్థ.