బంపరాఫర్ : ఐ ఫోన్ 15పై.. రూ.50 వేల డిస్కౌంట్

బంపరాఫర్ : ఐ ఫోన్ 15పై.. రూ.50 వేల డిస్కౌంట్

ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇండియాలో మొబైల్ యూజర్లు ఎక్కువగా వాడే ఫోన్లలో ఐ ఫోన్ ఒక్కటి. ఐ ఫోన్  ప్రతి ఒక్కరు  వాడాలనుకుంటారు. దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇపుడు ఫ్లిప్ కార్ట్ సామాన్యులకు భారీ ఆఫర్ ఇస్తోంది. 

 యాపిల్ ఐ ఫోన్ 15 సిరీస్ ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న iPhone మోడల్‌లలో ఒకటి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అత్యధికంగా అమ్ముడైన ఆపిల్ ఐఫోన్ 14 తర్వాత యాపిల్ ఐఫోన్ 15 ఉంది. 2023 సెప్టెంబర్ లో లాంచ్ అయిన యాపిల్ 15 సిరీస్ ప్రస్తుతం  Flipkart సేల్‌లో Apple iPhone 14 కంటే తక్కువ ధరకే  అందిస్తోంది.

యాపిల్ ఐ ఫోన్ 15 సిరీస్  లాంచ్ చేసినప్పుడు  128GB స్టోరేజ్‌ Apple iPhone 15  భారత్ లో  రూ. 79,900  గా ఉంది. అయితే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ మీరు 14 వేల 999కి దక్కించుకోవాలంటే.. ఐఫోన్ ఎక్చేంఛ్ తోపాటు, సిటీ బ్యాంక్ ఈఎంఐ ఆఫర్స్ గరిష్ఠంగా పొందగలిగి ఉండాలి. పాత ఐఫోన్ ఎక్చేంఛ్ ధర ఆధారంగా గరిష్ఠంగా రూ. 51 వేల 500 డిస్కొంట్ పొందవచ్చు. అప్పుడే ఐఫోన్ 15 ధర రూ. 14,499కి లభిస్తుంది. Apple iPhone 15 Apple 48MP కెమెరా 12MP సెకండరీ సెన్సార్‌తో సపోర్ట్ చేస్తుంది.

ఐఫోన్ 15 సిరీస్ ధరలు : 

ఐఫోన్ 15 (iPhone 15):
128GB - రూ. 79,900
256GB - రూ. 89,900
512GB - రూ. 1,09,900
 

ఐఫోన్ 15 ప్లస్:

128GB - రూ. 89,900
256GB - రూ. 99,900
512GB - రూ. 1,19,900