Layoffs: ఆపిల్ కంపెనీ నుంచి 600 మంది ఉద్యోగులు ఔట్

Layoffs: ఆపిల్ కంపెనీ నుంచి 600 మంది ఉద్యోగులు ఔట్

టెక్ దిగ్గజం ఆపిల్.. 600 మంది ఉద్యోగులను శుక్రవారం (ఏప్రిల్ 5) తొలగించింది.సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రాజెక్టు, స్మార్ట్ వాచ్ స్క్రీన్ ప్రాజెక్టు మైక్రో ఎల్ఈడీలను రద్దు చేసిన తర్వాత  అందులో పనిచేసే 600 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫోకస్ పెట్టిన కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 

2014 నుంచి ప్రాసెస్ లో ఉన్న సెల్ఫ్ డ్రైవ్ కార్ల ప్రాజెక్టును మూసివేస్తున్నట్లు ఈ ఏడాది 2024 ఫిబ్రవరిలో ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆపిల్ ఉద్యోగులను కొత్త ప్రాజెక్టులోకి మార్చడం గానీ, తొలగించడం గానీ జరుగుతుందని వెల్లడించింది. కొన్ని రోజుల తర్వాత ఆపిల్ వాచ్ అల్ట్రాలకు అందించే మైక్రో లెడ్ డిస్ ప్లే ప్రాజెక్టును కూడా రద్దు చేసుకుంది.ఇందులోపనిచేసే కొంతమందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఆపిల్. అయితే కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. బ్లూమ్ బెర్గ్ మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం.. ఆపిల్ 600 మంది ఉద్యోగులను తొలగించనట్లు తెలుస్తోంది.