రికార్డు స్థాయిలోఐఫోన్ల ఎగుమతులు..జూన్ క్వార్టర్ ఎక్స్పోర్ట్స్ విలువ రూ.43 వేల కోట్లు

రికార్డు స్థాయిలోఐఫోన్ల ఎగుమతులు..జూన్ క్వార్టర్ ఎక్స్పోర్ట్స్ విలువ రూ.43 వేల కోట్లు

న్యూఢిల్లీ: భారతదేశం నుంచి స్మార్ట్‌‌‌‌ఫోన్ల ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ జూన్ క్వార్టర్​లో దేశం నుంచి జరిగిన మొత్తం స్మార్ట్‌‌‌‌ఫోన్ ఎగుమతుల విలువ ఏడు బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.60,326 కోట్లు) చేరింది. 

ఇందులో టెక్ యాకంపెనీ యాపిల్​ సంస్థ ఒక్కటే 5 బిలియన్ డాలర్ల (రూ.43,090 కోట్లు)విలువైన ఐఫోన్లను ఎగుమతి చేయడం విశేషం. ఏడాది లెక్కన వీటి విలువ 40 శాతం పెరిగింది.  

తన ప్లాంట్లను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరించాలనే వ్యూహంలో భాగంగా యాపిల్​ భారతదేశాన్ని కీలక హబ్‌‌‌‌గా మార్చుకుంటోంది. ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. 

ఈ రికార్డు ఎగుమతుల్లో యాపిల్ వాటానే అత్యధికంగా ఉండగా, శాంసంగ్‌‌‌‌ వంటి ఇతర కంపెనీలు తరువాతి స్థానాల్లో నిలిచాయి.