బిజినెస్ బాగుంది : ఇండియాలో మరో మూడు యాపిల్ స్టోర్స్

బిజినెస్ బాగుంది : ఇండియాలో మరో మూడు యాపిల్ స్టోర్స్

ఇటీవల ఇండియాలో ప్రారంభమైన రెండు యాపిల్‌  స్టోర్లు అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్నాయి . దేశంలో అత్యధికంగా సేల్స్ జరుగుతున్న  స్టోర్లుగా అవతరించాయి. ఈ రెండు స్టోర్లలో నెలవారీ విక్రయాలు రూ. 22 కోట్ల నుంచి 25 కోట్ల మధ్య ఉన్నాయి. 

దివాళీ సీజన్ కాకుండా ఓ ఎలక్ట్రానిక్ స్టోర్లో ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరగడం ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. సాధారణ సీజన్ లో కూడా అత్యధిక విక్రయాలు జరుపుతూ యాపిల్‌ కు భారత్ నుంచి మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. 

యాపిల్‌ సీఈఓ టిమ్ కిక్ ఈ రెండు స్టోర్లను 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.   దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి మహానగరాల్లో స్టోర్లను ప్రారంభించారు.  అయితే సేల్స్ బాగా జరుగుతుండడంతో ఇండియాలో మరో  మూడు స్టోర్లను ప్రారంభించాలనే యోచనలో యాపిల్ ఉంది. ప్రస్తుతం దీని గురించి చర్చలు జరుగుతున్నాయి.  

తాజా సమాచారం ప్రకారం  2025లో ఇండియాలోని బోరివల, న్యూ ఢిల్లీలో DLF ప్రొమెనేడ్ మాల్‌, వర్లీ  ప్రాంతాలలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.  ప్రస్తుతం యాపిల్‌  26 దేశాలలో 520కి పైగా స్టోర్‌లను కలిగి ఉంది. మరో వైపు యాపిల్‌  కొత్త మోడల్స్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. iPhone 15, Apple Watch Series 9, కొత్త Macను త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.