అప్రెంటిస్‌‌షిప్ ట్రైనింగ్​కు అప్లికేషన్స్ షురూ

 అప్రెంటిస్‌‌షిప్ ట్రైనింగ్​కు అప్లికేషన్స్ షురూ

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌‌షిప్ ట్రైనింగ్​కు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. ఆన్​లైన్​లో ఆగస్టు 18 వరకు అప్లై చేసుకోవచ్చు. 

ట్రేడులు: మొత్తం 319 ఖాళీల్లో ఫిట్టర్ విభాగంలో- 80, టర్నర్​ - 10, మెషినిస్ట్ 14, వెల్డర్ 40, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్  - 20, ఎలక్ట్రీషియన్​ - 65, కార్పెంటర్ గా 20, మెకానిక్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్- విభాగంలో 10, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌‌గా 30, మెకానిక్ డీజిల్- ట్రేడులో 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించాలి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్​ ప్రాసెస్​ ఉంటుంది. ఆన్​లైన్​లో ఆగస్టు 18 వరకు అప్లై చేసుకోవాలి. పరీక్షను సెప్టెంబర్​ 4వ తేదీన నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.rinl.onlineregistrationforms.com వెబ్​సైట్​లో సంప్రదించాలి