గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

బాల్కొండ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలబాలికల స్కూళ్లల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల కన్వీనర్ గంగా శంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ ఎడపల్లి, పోచంపాడ్ లోని గురుకులాల్లో  6,7,8 తరగతుల సీట్ల భర్తీ కోసం హెచ్​ఎంలను సంప్రదించాలన్నారు. జూన్ 30 నుంచి జులై 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, ప్రవేశ పరీక్ష జులై 4న ఆయా స్కూళ్లల్లో నిర్వహిస్తారని తెలిపారు. మెరిట్ ఆధారంగా రోస్టర్ పద్ధతిలో సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. సంబంధిత వివరాలకు ఎడపల్లి హెచ్​ఎం 9866559697, పోచంపాడ్ లో  9701222079, 9866559693 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.