
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: భూభారతి చట్టం కింద లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మే 17వ తేదీ లోపు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. భూభారతి చట్టం కింద భూమి రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే సబ్ డివిజన్ మ్యాప్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లైసెన్సు సర్వేయర్ గా ఎంపికైన వారు నెలకు సుమారు రూ.30 వేల పైగా ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.
లైసెన్స్ సర్వేయర్ గా ఎంపికైన వారికి జిల్లా కేంద్రంలో ఈ నెల 26 నుంచి జులై 26 వరకు రెండు నెలల పాటు (50 పని దినాలలో) శిక్షణ అందిస్తామన్నారు. శిక్షణ ముగింపులో పరీక్ష ఉంటుందని, ఈ పరీక్షలో థియరీ, ప్లాటింగ్ అండ్ ప్రాక్టికల్ అనే మూడు భాగాలు ఉంటాయన్నారు. పరీక్షలోని ప్రతి విభాగంలో 60 శాతం ఉత్తీర్ణత సాధించాలని, మొత్తం 3 పేపర్లలో ఉత్తీర్ణత సగటున 70 శాతానికి తక్కువ కాకుండా ఉండాలని తెలిపారు. శిక్షణ పొంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, ప్రభుత్వ సర్వేయర్ కింద 40 పని దినాల పాటు అప్రెంటిస్‌షిప్ చేయాల్సి ఉంటుందని సూచించారు