 
                                    సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ హైదరాబాద్ ఉత్తర్వుల మేరకు.. 20 రోజుల్లోగా దరఖాస్తులను సహాయ కమిషనర్ కార్యాలయం, బీఎస్ఎన్ఎల్ బిల్డింగ్ నల్గొండలో అందించాలని సూచించారు.

 
         
                     
                     
                    