అపాయింటెడ్ చీఫ్​కు ఒక్క శాతం మద్దతూ దక్కదు

అపాయింటెడ్ చీఫ్​కు ఒక్క శాతం మద్దతూ దక్కదు

గులాం ఆజాద్ ఆజాద్
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పును కోరుతూ 23 మంది సీనియర్లు అధినేత్రి సోనియాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఈ లేఖపై దుమారం రేగిన సంగతి విధితమే. ఈ లెటర్‌‌ రాసిన వారిలో ఒకరైన కాంగ్రెస్ వెటరన్ నేత గులాం నబీ ఆజాద్ నాయకత్వ మార్పునకు సంబంధించి తాజాగా వ్యాఖ్యానించారు. పార్టీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన అభ్యర్థికి 1% ఓటు మద్దతు కూడా దక్కబోదన్నారు.

‘ఎన్నికలతో ఒక ప్రయోజనం ఉంటుంది. ఎన్నికల్లో పోరాడితే కనీసం 51 శాతం పార్టీ సభ్యులు మీ వైపు ఉంటారు. కానీ ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తికి కనీసం ఒక్క శాతం మద్దతు కూడా లభించదు. ఒకవేళ సీడబ్ల్యూసీ మెంబర్లు ఎన్నికైతే వాళ్లు తొలగించబడరు. అలాంటప్పుడు సమస్య ఏంటి?. మా ప్రపోజల్‌ను తప్పుబట్టిన ఆఫీస్ బేరర్లు, స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్స్ లేదా బ్లాక్ డిస్ట్రిక్ట్‌ ప్రెసిడెంట్స్‌ల్లో ఏ ఒక్కరూ ఎన్నికల సమయంలో లేరు. కాంగ్రెస్‌ కోసం కష్టపడిన వారు ఆ లెటర్‌‌ను స్వాగతిస్తారు’ అని ఆజాద్ పేర్కొన్నారు.