భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) హైదరాబాద్, కంచన్‌బాగ్ యూనిట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ జూన్ 1 నుంచి జూన్ 8 వరకు అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 33.
విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్ 3, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 8, మెషినిస్ట్ 7, మెషినిస్ట్ గ్రైండర్ 2, మెకానిక్ డీజిల్ 1, మెకానిక్ ఆర్ & ఏసీ 4, టర్నర్ 6, వెల్డర్ 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/ ఎస్ఎస్సీతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ అప్రెంటిస్‌షిప్‌కు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు.
వయోపరిమితి: 14 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కంచన్ బాగ్, హైదరాబాద్ చిరునామాకు అప్లికేషన్లు పంపించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 1.
లాస్ట్ డేట్: జూన్ 8.
సెలెక్షన్ ప్రాసెస్: ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ bdl-india.inను సందర్శించండి.
