పార్లమెంట్ కమిటీ విచారణ తర్వాతే నిర్ణయం.. ఎంపీ మహువా మొయిత్రా అంశంపై టీఎంసీ

పార్లమెంట్ కమిటీ విచారణ తర్వాతే నిర్ణయం.. ఎంపీ మహువా మొయిత్రా అంశంపై టీఎంసీ

కోల్ కతా: పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన లంచం ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పందించింది. దీనిపై పార్లమెంట్ కమిటీ విచారణ తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

‘‘లంచం ఆరోపణలపై తన జవాబు ఏంటో చెప్పాలని మహువా మొయిత్రాకు పార్టీ సూచించింది. ఆమె ఇప్పటికే తన సమాధానం చెప్పింది. ఇప్పుడీ అంశంపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. ఆ కమిటీ రిపోర్టు కోసం వేచి చూస్తున్నాం. ఆ తర్వాత పార్టీ నాయకత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది” అని ఆయన తెలిపారు. కాగా, అదానీ గ్రూప్ లక్ష్యంగా పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు బిజినెస్ మెన్ దర్శన్ హీరానందానీ నుంచి మహువా మొయిత్రా లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.