ఎన్టీఆర్‌ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం

ఎన్టీఆర్‌ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం

డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరును డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి సవరించిన చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్శిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. తాజాగా ఈ నిర్ణయానికి గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు.   

ఇదిలా ఉంటే సీఎం జగన్ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో పలువురు ప్రముఖులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీకి ఉన్న బలం ఆధారంగా పూర్తి మెజారిటీతో ఈ బిల్లుకు గత కొన్ని రోజుల క్రితమే ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గవర్నర్ కు పంపింది. పరిశీలన అనంతరం ఈ బిల్లుకు ఆమోదముద్ర శారు. ఈ బిల్లును చట్టంగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అధికారికంగా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారిపోయింది.