ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్..  ఈ నెల 28 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్..  ఈ నెల 28 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

APPSC గ్రూప్-1 (Group 1) అభ్యర్థులకు గుడ్ న్యూ్స్ చెప్పింది. దరఖాస్తు గడువును మరో వారం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గత నెలలో 81 గ్రూప్-1 (Group 1) పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీలో   Group 1  పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఏపీపీఎస్సీ (APPSC) పొడిగించింది. దరఖాస్తు గడువు జనవరి 21తో ముగిసినప్పటికీ.. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగించినట్లు ఏపీపీఎస్సీ  తెలిపింది. గ్రూప్​ 1  (Group 1)కు దరఖాస్తు చేసే అభ్యర్థులు జనవరి 28న అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని కమిషన్ తెలిపింది.   ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న ప్రిలిమినరీ (స్క్రీనింగ్) పరీక్ష నిర్వహించనున్నారు. 

 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

APPSC  గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించనున్నారు.