భద్రాచలం, వెలుగు: పీఎల్జీఏ బెటాలియన్ నంబర్ 1 కమాండర్ బార్సే దేవ తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజుల కింద బార్సే దేవాతో పాటు 19 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మాకు బార్సే దేవా ప్రధాన అనుచరుడు. ఇద్దరిదీ సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామమే. హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం దేవా పీఎల్జీఏ నంబర్ వన్ ప్లాటూన్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు.
