ఏపీ తెలంగాణ మధ్య బస్సులు నడుస్తున్నాయి.. పుకార్లు నమ్మొద్దు : ఏపీఎస్ ఆర్టీసీ

ఏపీ తెలంగాణ మధ్య బస్సులు నడుస్తున్నాయి.. పుకార్లు నమ్మొద్దు : ఏపీఎస్ ఆర్టీసీ

ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ క్రమంలో ఆందోళనలు జరుగుతున్నాయి.. ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్పందించింది. ఆర్టీసీ బస్సులు అన్నీ యథావిధిగా నడుస్తున్నాయని.. సర్వీసులు అన్ని తిప్పుతున్నామని స్పష్టం చేశారు. ఏపీలో అంతా ప్రశాంతంగా ఉందని.. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ మాత్రమే అయ్యారని.. దీని కోసం ఆర్టీసీ బస్సులను ఎందుకు నిలిపివేస్తామని వివరణ ఇచ్చారు.

Also Read : అవినీతి కుట్ర చేసింది చంద్రబాబే.. పదేళ్ల జైలు పడే ఛాన్స్, లోకేష్ పాత్ర ఉంది : ఏపీ సీఐడీ

తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య నిత్యం వేలాది బస్సులు తిరుగుతుంటాయని.. అన్ని సర్వీసులు యథావిధిగా నడుస్తు్న్నాయని వెల్లడించింది ఏపీఎస్ ఆర్టీసీ. పూర్తి సర్వీసులు.. షెడ్యూల్ ప్రకారం బస్సులు తిప్పుతున్నామని.. దూర ప్రాంత ప్రయాణికులు ఎవరూ సోషల్ మీడియా వార్తలు, పుకార్లను పట్టించుకోవద్దని వివరణ ఇచ్చింది ఆర్టీసీ. 

హైదరాబాద్ విజయవాడ మధ్య ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ బస్సులు అన్నీ.. షెడ్యూల్ ప్రకారం.. టైం ప్రకారం నడుస్తున్నాయని.. ఏ బస్సు సర్వీసులను నిలిపివేయలేదని.. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించింది ఏపీఎస్ ఆర్టీసీ..