
కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్‌జిల్లా కేంద్రంలోని ఏ ఆర్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తున్న ఏఆర్ ఎస్సై హార్ట్ఎటాక్తో మృతిచెందారు. కాగజ్ నగర్ మండలం ఈస్గాం నజ్రుల్ నగర్‌కు చెందిన ఏఆర్ ఎస్సై జగదీశ్ చంద్రమండల్ (55) ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్ లో ఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన స్వగ్రామంలో ఉండగా మంగళవారం రాత్రి గుండెపోటు వచ్చింది. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో హాస్పిటల్‌కు తరలించేలోపే మృతి చెందాడు. జగదీశ్ చంద్రమండల్ భౌతిక కాయానికి బుధవారం ఎస్పీ కాంతిలాల్ సుభాష్ నివాళులు అర్పించారు.
1993లో కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరిన జగదీశ్ చంద్రమండల్.. ఆ తర్వాత ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొంది అత్యున్నత సేవలందించారని ఎస్పీ పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులను ఎస్పీ ఓదార్చారు. అంత్యక్రియల కోసం తక్షణ సాయం కింద రూ.30 వేలు అందించారు. ఎస్పీతో ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి, కాగజ్ నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, ఆర్ఐ ఎంటీవో అంజన్న, ఈస్ గాం ఎస్సై కళ్యాణ్ ఉన్నారు.