
సినీ ఇండస్ట్రీలో అవకాశాలపై ‘బిగ్ బాస్ 16’ ఫేమ్, నటి అర్చన గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాపై ఇష్టంతో అవకాశాల కోసం ముంబై వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది.
"నేను పీజీ చదువుతున్న రోజుల్లో ఒక పరిచయం అయ్యింది. ఆమె నాకు సినిమాపై ఉన్న ఇష్టాన్ని అర్థం చేసుకుంది. మీరు సినిమా ఆడిషన్స్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అని అడిగింది. నేను అవుననే చెప్పాను. దీంతో ‘నువ్వు ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు షార్ట్‌లు వేసుకుని వెళ్లు. నిర్మాతలకు అలాగే కనిపించాలి. టాప్ కూడా అలాగే ఉంటే తప్పకుండా సెలెక్ట్ అవుతావు’ అని చెప్పింది.
ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యాను. పొట్టి బట్టలు వేసుకుంటే అవకాశం ఇస్తారా అని ఆశ్చర్యపోయాను. ఆతరువాత కొంత కాలానికే టీవీ షోలో అవకాశం వచ్చింది" అంటూ చెప్పుకొచ్చింది అర్చన గౌతమ్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.