ఆర్కిటిక్ ఓపెన్లో పీవీ సింధు ఓటమి

ఆర్కిటిక్ ఓపెన్లో పీవీ సింధు ఓటమి

భారత షెట్లర్ పీవీ సింధు ఆర్కిటిక్ ఓపెన్ సెమీఫైనల్లోపరాజయం పాలైంది. శనివారం( అక్టోబర్14న) ఎనిమిదో సీడ్ సింధు 12-21, 21-11, 7-21తేడాతో ఐదో సీడ్ జియివాంగ్ (చైనా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో తేలిపోయిన సింధు రెండో గేమ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబర్చింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో గేమ్లో పేలవమైన ఆటతీరుతో ప్రత్యర్థికి తలవంచింది. ఇప్పటివరకు జియివాంగ్ తో పోటీ పడిన మూడు మ్యాచుల్లో పీవీ సింధు ఓడడం ఇదే తొలిసారి.