ఇండ్లు లేని పేదలకంటే కమ్మ, వెలమలే ఎక్కువా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఇండ్లు లేని పేదలకంటే కమ్మ, వెలమలే ఎక్కువా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

 వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో ఇండ్లు లేని పేద లను పట్టించుకోకుండా ఉన్నోళ్ల కులాలకు బిల్డింగులు కట్టించేందుకు సీఎం కేసీఆర్ కు సిగ్గుండాలని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బుధవారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలంలోని పలు గ్రామాల్లో  పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పేదల కోసం కాకుండా పెద్దల కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు.

తన ఫామ్ హౌస్ కు నీళ్లందించే కొండపోచమ్మ ప్రాజెక్టుకు రూ.1,891 కోట్లు పెట్టి పూర్తి చేశారని, అదే, వనపర్తి జిల్లాలోని గణప సముద్రం ప్రాజెక్టుకు రూ.55 కోట్లు,బుద్ధారం రిజర్వాయర్ కు రూ.42.2 కోట్లు మాత్రమే కేటాయించి పూర్తి చేయలేదని మండిపడ్డారు. బీసీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సుపారీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయని, హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, ఇన్​చార్జిలు నాగనమోని చెన్నరాములు, లీడర్లు మిద్దె మహేశ్, గడ్డం మహేశ్, రంజిత్, రాములు, రాములమ్మ పాల్గొన్నారు.