డార్లింగ్​ అన్నారా.. లైంగికంగా వేధించినట్టే... హైకోర్టు కీలక వ్యాఖ్యలు

డార్లింగ్​ అన్నారా.. లైంగికంగా వేధించినట్టే... హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. IPC 354ఏ, 509 సెక్షన్ల ప్రకారం ఇది నేరమే అని స్పష్టం చేసింది. జస్టిస్ జై సేన్‌గుప్త ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ కేసు విచారణ చేపట్టిన కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తెలియని మహిళలను డార్లింగ్​ అని  సంబోధిస్తే లైంగికంగా వేధించినట్టే అవుతుందని అని చెప్పింది. 

ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో జస్టిస్ సేన్‌గుప్తా తీవ్ర అసహనానికి లోనయ్యారు. రోడ్డుపైన వెళ్తూ ఓ యువతినో, మహిళనో చొరవ తీసుకుని మరీ డార్లింగ్ అనే స్థాయికి భారత సంస్కృతి ఇంకా దిగజారిపోలేదని స్పష్టం చేశారు. ఇది ఇండియన్ కల్చర్ కాదని వెల్లడించారు. పైగా...మద్యం మత్తులో ఇలాంటివి చేస్తే అది ఇంకా పెద్ద నేరం అవుతుందని తేల్చి చెప్పారు.

కేసు ఏంటంటే..

ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌కత్తాలో 2015 అక్టోబర్ 21న  దుర్గా పూజ జరుగుతుండగా ఓ మహిళా కానిస్టేబుల్ అక్కడ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి ట్రాఫిక్‌కు ఇబ్బంది క‌లిగిస్తూ.. నారా ర‌చ్చ చేశాడు. దీంతో ఆమె ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ సమయంలోనే నిందితుడు మహిళా కానిస్టేబుల్‌తో.. "డార్లింగ్ నాకు ఫైన్ వేస్తావా`` అని వ్యాఖ్యానించాడు. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న కానిస్టేబుల్ కేసు పెట్టింది. ఇదికాస్తా.. కోర్టుకు వెళ్లింది. 

డార్లింగ్ అన‌డం కామ‌నేన‌ని.. నిందితుడి త‌ర‌ఫు న్యాయ‌వాది పేర్కొన్నారు. దీనిపై రియాక్ట్ అయిన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జైసేన్ అస‌లు ఎవ‌రినీ డార్లింగ్ అని పిలిచే అవ‌కాశం లేద‌న్నారు. ఇది మ‌హిళ మ‌నోభావాలకు, డిగ్నిటీకి సంబంధించిన విష‌య‌మ‌ని పేర్కొన్నారు. `` మహిళను ఎవరు డార్లింగ్ అని పిలిచినా అది కచ్చితంగా నేరమే. అలా పిలిచిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నా లేకపోయినా అది నేరమే అవుతుంది. 

ట్రయల్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు ధృవీకరించింది. కానీ జైలు శిక్షను మూడు నెలల నుండి ఒక నెలకు సవరించింది. అంతకుముందు 2023 ఏప్రిల్లో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, 2023 నవంబర్లో అదనపు జిల్లా జడ్జి రామును దోషిగా నిర్ధారించారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.  అయితే, డార్లింగ్ ను కాస్త కఠినంగా చెప్పినందుకు ఒక వ్యక్తికి నెల రోజుల జైలు శిక్ష విధించి, హెచ్చరించవచ్చునని బెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ బిమల్ ఛటర్జీ అన్నారు. అయితే ఓ లేడీ కానిస్టేబుల్ డ్యూటీలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఇలాంటి ఘాటుగా కామెంట్ చేయడం బాధాకరం. నమస్కారం మరికొంచెం నాగరికంగా ఉంటే బాగుండేది. యూనిఫామ్ లో ఉన్న మహిళకు ఇది టీజింగ్ గా అనిపించవచ్చు అని రియాక్ట్ అయ్యారు.