ముల్లంగి ఒకటి రెండు ముక్కలతో సరిపెడుతున్నారా..? ఇది మీకోసమే 

ముల్లంగి ఒకటి రెండు ముక్కలతో సరిపెడుతున్నారా..? ఇది మీకోసమే 
చలికాలం రాగానే ముల్లంగి ఎక్కువగా కనిపిస్తుంది. తెల్లగా మెరిసిపోతూ ఉండే ముల్లంగి అందంగా కనిపించినా తినటానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు తక్కువే. మహా అయితే ఒకటో రెండో ముక్కలు సాంబార్‌‌లో వేసుకుంటారు. అంతే తప్పితే, ముల్లంగిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే ముల్లంగిని తినటం చాలా మంచిది… లివర్‌‌ని మంచి కండిషన్‌లో ఉంచుతుంది ముల్లంగి. బ్లడ్‌ని క్లీన్ చేస్తుంది. అలాగే ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ముల్లంగికి శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ను తగ్గించడానికి, మూత్రవిసర్జనలో ఏర్పడే మంటను తగ్గించటానికి ఉపయోగపడుతుంది. ముల్లంగిని రెగ్యులర్ గా తినటం వల్ల కిడ్నీలు, యూరినరీ సిస్టమ్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడవు. రెస్పిరేటరీ సమస్యలను తగ్గిస్తుంది ముల్లంగి. ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళంతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, అలర్జీలని తగ్గిస్తుంది. ముల్లంగిలో విటమిన్ సి, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉండటం వల్ల స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది. క్లెన్సర్, ఫేస్ ప్యాక్ గా వాడటం వల్ల స్కిన్ ని సున్నితంగా..అందంగా మార్చుతుంది. అందుకే చలికాలం దొరికే ఈ ముల్లంగిని పక్కన పెట్టేయకుండా తినటం అలవాటు చేసుకుంటే హెల్త్​కు చాలా మంచిది. ఇవి కూడా చదవండి జడ్చర్ల నుంచి జపాన్ వరకు.. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అన్నార్థుల ఆకలి తీర్చే ఆలయం రియల్ మార్కెట్​కు.. మూఢాలు కలిసొస్తున్నయ్​