ఐడియా అదిరిపోయింది.. హైదరాబాద్ ఫ్లైఓవర్ల కింద కూడా ఇలా చేస్తే..

ఐడియా అదిరిపోయింది.. హైదరాబాద్ ఫ్లైఓవర్ల కింద కూడా ఇలా చేస్తే..

స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకు స్థలం దొరికడం లేదని నాన్చే అధికారులకు ఓ యువకుడు బెస్ట్ ఐడియా చెప్పాడు. రోడ్డుపై ఉండే ఫ్లై ఓవర్ల కింది భాగాన ఖాళీగా ఉండే స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. ఫ్లైఓవర్ కింద నిర్మించిన పబ్లిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను చూపించే ఓ వీడియో సోషల్ మీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ధనన్యాజ్_టెక్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోలో ఫ్లై ఓవర్ కింద ఉన్న ఓ బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఆ ప్రాంతాన్ని చూపిస్తూ.. ఫ్లైఓవర్ కింద మిగిలిన సగం ప్రాంతంలో బ్యాడ్మింటన్ కోర్ట్‌ని చూపించాడు. దాంతో పాటు ఇది చాలా బ్రిలియంట్ ఐడియా అని, అన్ని నగరాల్లోనూ ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ క్యాప్షన్ లో తెలిపాడు. ఇలాంటిదే మీ సిటీలో ఉందా..? అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ ఐడియాను వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాతో సహా పలువురు స్మార్ట్ ప్లానింగ్‌ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సంపద ఫ్లై ఓవర్ కింద 2021లో నిర్మించినట్టు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో, బంతులు, ఇతర వస్తువులు రోడ్డుపై పడకుండా  నెట్‌తో ఆ ప్రాంతాన్ని కవర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు1.3 మిలియన్ వ్యూస్ రాగా... 12,000 పైగా లైక్‌లు వచ్చాయి. ఈ అమేజింగ్ ఐడియాను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు.  గొప్ప మేక్ఓవర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ తరహా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఢిల్లీలోనూ ఏర్పాటు చేయాలని మరికొందరు కోరుతున్నారు. నవీ ముంబై నుండి వెలువడిన స్థానిక దినపత్రిక న్యూస్‌బ్యాండ్ ప్రకారం, ఈ పబ్లిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2745.27 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది డిసెంబర్ 2022లో క్రీడాకారులకు ఉచితంగా ఉపయోగించుకునేలా ఏర్పాటు చేశారు.

https://twitter.com/Dhananjay_Tech/status/1640261282002784256