సమస్యలోనే సమాధానం

సమస్యలోనే సమాధానం

సమస్యలోనే సమాధానం దొరుకుతుంది అంటారు చాలామంది. అలా తనకు ఎదురైన సమస్యకు సమాధానం వెతికింది. తను పడ్డ కష్టం ఇంకొకరు పడొద్దు అనుకుంది. అందుకు కావాల్సిన జవాబు వెతుకుతూ అందరికి ఉపయోగపడే గ్యాడ్జెట్‌‌ తయారుచేసింది అర్జెంటీనాకు చెందిన 41 ఏండ్ల పౌలా ఎస్ట్రాడా.

పౌలా 200‌‌‌‌9లో రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. కీమోథెరపీ  ట్రీట్మెంట్‌‌ తీసుకుంది. తరువాత క్యాన్సర్‌‌‌‌నుంచి కోలుకున్నా, దానివల్ల వచ్చిన సైడ్‌‌ ఎఫెక్ట్స్‌‌తో ఇష్టంగా పెంచుకున్న జుట్టు కోల్పోయింది. ‘నాలాగే జుట్టును అపురూపంగా పెంచుకునేవాళ్లు చాలామందే ఉంటారు. వాళ్లకోసం ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాల’నుకుంది. అప్పుడే ‘కూలింగ్‌‌ క్యాప్‌‌’ ఆలోచన వచ్చింది పౌలాకు. దాంతో ఐస్‌‌ ప్యాక్‌‌లను ఒక క్యాప్‌‌లో పెట్టి హెల్మెట్‌‌ లాంటిదాన్ని తయారుచేసింది. అది కీమోథెరపీ టైంలో తలకు పెట్టుకోవాలి. అందులో ఉన్న ఐస్‌‌ తల మీద ఉన్న రక్తనాళాలను అణిచి, కీమోథెరపీలో వాడిన మెడిసిన్‌‌ జుట్టు కుదుళ్లకు చేరకుండా చేస్తుంది. అలా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఫుడ్‌‌ అండ్‌‌ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌‌ అనుమతులు తీసుకున్న తర్వాత అర్జెంటీనాతో పాటు చిలీ, మెక్సికో, స్పైయిన్‌‌లోని అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్‌‌లో ఈ క్యాప్‌‌ అందుబాటులోకి వచ్చింది. ఈ హెల్మెట్‌‌ను కీమోథెరపీ నుంచి పెట్టుకోవడం మొదలుపెట్టాలి. ప్రతీ అరగంటకోసారి మార్చాలి. అలాగే క్యాప్‌‌ టెంపరేచర్‌‌‌‌ నాలుగు డిగ్రీల ఫారెన్‌‌ హీట్‌‌ దగ్గర ఉండాలి. ఇది తయారుచేసిన ఎస్ట్రాడా ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్‌‌‌‌గా, పొలిటీషియన్స్‌‌, బిజినెస్‌మెన్‌‌లకు అడ్వైజర్​గా పనిచేస్తోంది. మోటివేషనల్‌‌ స్పీకర్‌‌‌‌గా క్యాన్సర్‌‌‌‌ పేషెంట్లకు ధైర్యాన్ని ఇస్తోంది.