నువ్వు నిజంరా అమర్.. నువ్వు హీరో.. అరియాన షాకింగ్ పోస్ట్

నువ్వు నిజంరా అమర్.. నువ్వు హీరో.. అరియాన షాకింగ్ పోస్ట్

బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియాన షాకింగ్ కామెంట్స్ చేశారు. తన ఫ్రెండ్ బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ గురించి చెప్తూ ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై మండిపడుతున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో.. అంతకుమించి వివాదాలను కూడా తీసుకొచ్చింది. ఇక హౌస్ లో ఉన్నప్పుడు అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ చాలాసార్లు గొడవలు పడ్డారు, అరుచుకున్నారు కూడా. దీంతో అమర్ దీప్ కు బయట చాలా నెగిటీవ్ ఏర్పడింది. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ అప్పుడు కొంతమంది అమర్ పై దాడికి కూడా ప్రయత్నించారు. 

తాజాగా బిగ్ బాస్ 4కంటెస్టెంట్ అరియనా తన ఫ్రెండ్ అమర్ దీప్ గురించి ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నా ఫ్రెడ్ అమర్ ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు నిజం రా.. నువ్వే అసలైన విన్నర్ వి, జనాలు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కొన్ని కాకులు అలానే అరుస్తూ ఉంటాయి.. వాటిని పాటించుకోకు.. అంటూ చెప్పుకొచ్చారు. ఆ వీడియో చూసిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కావాలనే అరియానా పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై అరియానా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.